
సముద్రం ముందు ఫొటొ దిగుతున్న ఓ యువతికి ఊహించని ప్రమాదం ఎదురైంది. సముద్రం ముందు యువతి ఫొటో దిగేందుకు ఓ కొండపైకి ఎక్కింది. అంతలోనే పెద్ద అల రావడంతో కొట్టుకుపోయింది. ఈ సంఘటన ఇండోనేషియాలో జరుగగా..ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇండోనేషియాలోని నుసా లెంబోన్గాన్ అనే ఐలాండ్ లో ఉన్న డెవిల్స్ టియర్ దగ్గర ఓ యువతి సముద్ర పక్కన ఉన్న కొండ మీదికి వెళ్లి ఫోటోకు పోజిచ్చింది. ఇంతలోనే భారీ అల వచ్చి తనను ఢీకొట్టింది. దీంతో ఆ యువతి అమాంతం ఎగిరి పడిపోయింది. భారీ అలలకు ఆ యువతి ఎక్కడ పడిపోయిందా అని అంతా ఒకేసారి అరిచారు.
అయితే.. ఆ యవతి చిన్న గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డెవిల్స్ టియర్ అనేది ఇండోనేషియాలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్. చాలామంది టూరిస్టులు అక్కడికి రోజూ వస్తుంటారు. అక్కడి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తుంటారు. ఫోటోలకు పోజులిస్తుంటారు. అయితే.. భారీ అలలు వచ్చినప్పుడు మాత్రం టూరిస్టులు ఆ అలలకు దూరంగా పరుగులు తీస్తారు. ఈ యువతి భారీ అలను గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
回复一下,擦伤了。不幸中的万幸 pic.twitter.com/3JirEJxiBi
— Kimmy Wong (@Kingwong2018) March 18, 2019