నెట్టింట్లో వైరల్ అవుతున్న “హ్యూమన్ హ్యాండ్ శానిటైజర్ ” ఉద్యోగం

నెట్టింట్లో వైరల్ అవుతున్న “హ్యూమన్ హ్యాండ్ శానిటైజర్ ” ఉద్యోగం

ప్రస్తుతం  సౌదీ అరేబియాలో శానిటైజర్ మ్యాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.

సౌదీ అరేబియా హెల్త్ మినిస్ట్రీ చెప్పిన వివరాల ప్రకారం ఆదేశంలో ఇప్పటి వరకు తాజాగా 17మందికి కరోనా వైరస్ సోకినట్లు ప్రకటించింది. దీంతో మొత్తం కలిపి 62మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు.

కరోనా వైరస్ తో అప్రమత్తం

కరోనా వైరస్ తో సౌదీ అరేబియా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాపించకుండా శానిటైజర్లను ఉపయోగించాలని పలు జాగ్రత్తలు చెబుతూ  ఉద్యోగుల్ని అప్రమత్తం చేస్తున్నాయి. సౌదీలో ప్రముఖ ఆయిల్ కంపెనీ అరంకో (Aramco) ప్రత్యేకంగా ‘హ్యూమన్ హ్యాండ్ శానిటైజర్’ గా ఓ ఉద్యోగిని నియమించింది. ఆఫీస్ కు వచ్చే ప్రతీ ఒక్కరికి  శానిటైజర్ ను అందించడమే పని. అయితే  ‘హ్యూమన్ హ్యాండ్ శానిటైజర్’ గా ఓ వ్యక్తిని నియమించడం పై వివాదం తలెత్తింది.

వైరస్ సోకుతుంటే  ప్రత్యేకంగా హ్యమన్ హ్యాండ్ శానిటైజర్ ను ఎలా నియమిస్తారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఉద్యోగుల్ని చీప్ గా చూడొద్దని సలహా ఇస్తున్నారు.

క్షమాపణలు చెప్పిన  సంస్థ

కంపెనీ లో హ్యమన్ హ్యాండ్ శానిటైజర్ వివాదం తలెత్తడంతో ఆయిల్ కంపెంనీ అరంకో దిగొచ్చింది. కావాలనే ఉద్యోగిని నియమించలేదని, ప్రతీ ఒక్కరు  కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉంచడమే తమ అభిమతమని చెప్పుకొచ్చింది.