- మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్
నల్గొండ అర్బన్, వెలుగు: కష్టపడి చదివితే ఏదైనాసాధించవచ్చు అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ అన్నారు. గురువారం నల్గొండలోని జిల్లా గ్రంథాలయంలో 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువును అలవాటుగా చేసుకుంటే ఆలోచన శక్తి, సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులు కొంత సమయాన్ని పుస్తక పఠనం చేయడం వల్ల శాంతి, సహనం, చిత్తశుద్ధి అలవడుతుందన్నారు.
గ్రంథాలయంలో పుస్తకాల వలన జ్ఞానం పెరుగుతుందని, తాను ఇదే గ్రంథాలయంలో మూడు సంవత్సరాలు పుస్తక పఠనం చేశానని తెలిపారు. అనంతరం ఆయన విద్యార్థులకు ప్రైజులు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, కార్యదర్శి బాలమ్మ, డీఎస్పీ స్పెషల్ బ్రాంచ్ టి. మల్లారెడ్డి, ప్రభుత్వ బాలికల కాలేజీ ప్రిన్సిపల్ సుధారాణి, బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ యూసుఫ్ ఖాన్, ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ గోనా రెడ్డి, పాల్గొన్నారు.
