వైరల్ : హమ్మర్..ది జెయింట్​

వైరల్ : హమ్మర్..ది జెయింట్​

వైరల్ ఐ వర్క్ ఫర్ హ్యాపీనెస్

కొందరు సంపాదన కోసం జాబ్ చేస్తారు. మరికొందరు వ్యాపారం చేస్తారు. కానీ, చాలామంది వాళ్లు చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కుంటారు. కొంతమందికి ఇతరుల గురించి కేర్ తీసుకోవడంలో సంతోషం ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే ఆయన కూడా అంతే!ఆర్యాన్ష్​. ఉదయ్​పూర్​లో ఒక ఉద్యోగి. ఆ రోజు వర్షం బాగా కురుస్తుండడంతో ట్రాఫిక్​ సిగ్నల్ దగ్గర తన కారు పార్క్​ చేశాడు. అక్కడ రోడ్​ పక్కన సమోస, పోహా అమ్మే షాప్​ కనిపించింది. ఆర్యాన్ష్​ సమోస ఆర్డర్ చేశాడు. షాపులో ఉన్న పెద్ద మనిషిని చూసి, పాపం.. పెద్దాయన ఇంత వర్షంలో కష్టపడుతున్నాడు అని జాలిపడి ‘ఈ రోజు రెస్ట్​ తీసుకోవచ్చు కదా’ అన్నాడు. అప్పుడు ఆ పెద్దాయన చెప్పిన మాట విని ఆర్యాన్ష్​కి ఆశ్చర్యం కలిగింది. పనిని ఎలా చూడాలో అర్థమైంది. ఇంతకీ ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే... ‘బాబూ.. ఈ వయసులో నేను కేవలం సంపాదించడానికి పని చేయడం లేదు. పని చేయడం వల్ల నా మనసుకు సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా కూర్చోవడం కన్నా ఇక్కడ షాపులో ఉండడం బెటర్​. ప్రజలు ఇక్కడి ఫుడ్​ తిని, టేస్ట్​ ఎంజాయ్ చేయడం చూస్తుంటే నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది’ అని. ఆయన మాటలు ఆర్యాన్ష్​ మనసుని కదిలించాయట. దాంతో అక్కడ వాళ్లిద్దరి మధ్య జరిగిన ఆ ఇన్సిడెంట్​ని తన ట్విట్టర్ అకౌంట్​లో పోస్ట్​ చేశాడు. ‘ప్రపంచం అంతా పని గురించి మాట్లాడుతుంటే.. కొందరు తమ రిటైర్​మెంట్​ కథలు రాస్తున్నారు’ అని ముగించాడు ఆర్యాన్ష్​. ఈ పోస్ట్​కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే మిలియన్ వ్యూస్ దాటేసింది. 

ఏఐతో బార్బీ మేకోవర్​

క్రియేటివిటీకి కాదేదీ అనర్హం! ఇక్కడ చూస్తున్నారుగా.. పింక్​ డ్రెస్​లో మెరిసిపోతున్న రాజకీయ నాయకులు. ఏంటి? వీళ్లంతా బార్బీ మూవీ సెలబ్రేషన్స్​లో భాగంగా మేకోవర్​ చేసుకున్నట్లు ఉంది కదూ. కానీ, ఇది నిజం కాదు. ఏఐ చేసిన మ్యాజిక్​. మొన్నామధ్య ఎలాన్​ మస్క్​, జుకర్ బర్గ్​ చెట్టాపట్టాలేసుకుని బీచ్​లో తిరిగిన ఫొటోలు ఇంటర్నెట్​లో హల్​చల్ చేశాయి గుర్తుందా? దానికి కారణం ఏఐ టెక్నాలజీ అని వార్తల్లో రాశారు. ఇప్పుడు ఈ పొలిటీషియన్లు బార్బీ మేకోవర్​లో కనిపించడానికి కారణం కూడా అదే టెక్నాలజీ.  మార్గట్​ రోబీ, ర్యాన్​ గాస్​లింగ్​ నటించిన ‘బార్బీ’ సినిమా జులై 21న విడుదలైంది. ప్రస్తుతం  ప్రపంచవ్యాప్తంగా సక్సెస్​ఫుల్​గా థియేటర్​లో రన్​ అవుతోంది. ఈ సందర్భంగా ప్రజలు, వ్యాపారులు, బ్రాండ్స్​ ఇలా అందరూ బార్బీ ఫీవర్​లో మునిగితేలుతున్నారు. పింక్​ కలర్​ కాస్ట్యూమ్స్​, డెకరేషన్స్​తో బార్బీ ప్రజెన్స్​ని క్రియేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక ఏఐ ఆర్టిస్ట్​ తనదైన క్రియేటివిటీతో ఇంటర్నెట్​ యూజర్స్​ని అతనివైపు తిప్పుకున్నాడు. ప్రజలందరికీ బాగా తెలిసిన పది మంది ఇండియన్ పొలిటీషియన్స్​ని బార్బీ మేకోవర్​లో చూపించాడు. అందులో సోనియా గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అమిత్ షా వంటి నాయకులు ఉన్నారు. ఈ ఫొటోలు ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేస్తే తెగ ట్రెండ్​ అయ్యాయి. ఆ ఫొటోల కింద ‘మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు?’ అని రాసి ఉంది. దానికి నెటిజన్​లు రకరకాలుగా సమాధానం ఇస్తున్నారు. 

హమ్మర్..ది జెయింట్​

హమ్మర్​ అనేది ఒక ఫోర్ వీలర్. చూడ్డానికి ఇది అన్ని హమ్మర్​ వెహికల్స్​లానే ఉంటుంది. కానీ, ఒక్క విషయంలో మాత్రం డిఫరెంట్​. ఇది మామూలు హమ్మర్​ వెహికల్స్​ కంటే మూడు రెట్లు పెద్దది. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. అందులో ఈ బండి రోడ్​ మీద పోలీసుల వెహికల్స్​ పార్క్​ చేసిన చోట ఆగింది. దాంతో ట్రాఫిక్​ పోలీసులు సైరన్ మోగిస్తూ వెనక్కి వెళ్లమని సైగ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఇది షేక్ హమద్​ బిన్ హమ్​దన్ అల్ నహ్‌‌‌‌యాన్​కి చెందింది. అతను యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​లోని రాజకుటుంబ సభ్యుడు. బిలియనీర్​ అయిన ఆయన వందల కొద్దీ అరుదైన కార్లు, ఆటోమోటివ్ క్రియేషన్స్​ వంటివి సేకరించారు. అందులో కొన్ని వరల్డ్ రికార్డ్​ సాధించినవి కూడా ఉన్నాయి. హమ్మర్​ విషయానికి వస్తే ఇది14 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు, 5.8 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది నడపగలిగే వాహనమే. అయితే, ఈ వీడియో పోయినేడాది పోస్ట్ చేసింది. ఇప్పుడు మరోసారి నెట్టింట ట్రెండ్​ అవుతోంది. ఇది రాసేటప్పటికే 21 మిలియన్ వ్యూస్​తో దూసుకెళ్తోంది.