జేఎన్‌‌‌‌యూ, డీయూలో పోస్టర్ల కలకలం

జేఎన్‌‌‌‌యూ, డీయూలో  పోస్టర్ల కలకలం

న్యూఢిల్లీ: ‘రాజ్యాంగాన్ని మర్డర్​ చేస్తున్న వారి నుంచి స్వేచ్ఛ కావాలి’ ‘నక్సలైట్ల నుంచి స్వేచ్ఛ కావాలి’ అంటూ లెఫ్ట్‌‌‌‌ పార్టీలను టార్గెట్‌‌‌‌ చేస్తూ జేఎన్​యూ, ఢిల్లీ వర్సిటీలలో రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. ‘‘దళితుల పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్న వారి నుంచి స్వేచ్ఛ కావాలి”, “అంబేడ్కర్‌‌‌‌‌‌‌‌ ఐడియాలజీలను, ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని నమ్మని వాళ్ల నుంచి స్వేచ్ఛ కావాలి” అంటూ పోస్టర్లను పెట్టారు. సీఏఏ, ఎన్నార్సీ తదితర అంశాలపై ఆందోళన చేస్తున్న లెఫ్ట్‌‌‌‌ పార్టీ స్టూడెంట్స్‌‌‌‌కు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు పెట్టినట్లు తెలుస్తోంది. సీఏఏ, ఎన్నార్సీకి సపోర్ట్‌‌‌‌గా ఉన్న ఎబీవీపీ, హిందూసేన ఈ పోస్టర్లను అంటించాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రఘురామ్‌‌‌‌రాజన్‌‌‌‌ సపోర్ట్

జేఎన్‌‌‌‌యూలో జరిగిన దాడికి వ్యతిరేకంగా బాలీవుడ్‌‌‌‌ నటి దీపికా పదుకొనె చేసిన నిశబ్ద నిరసన, ఎన్నికల కమిషనర్‌‌‌‌‌‌‌‌ అశోక్‌‌‌‌ లావాసా కుటుంబానికి వేధింపులు వచ్చినా నిష్పాక్షికంగా కర్తవ్యాన్ని నిర్వర్తించిన తీరును ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ మాజీ గవర్నర్‌‌‌‌‌‌‌‌ రఘురామ్‌‌‌‌రాజన్‌‌‌‌ మెచ్చుకున్నారు. వీళ్ల పోరాటం వల్ల దేశంలో నిజం, స్వేచ్ఛ, న్యాయం అనే పదాలు కొంత మందికి ఉన్నతమైన పదాలే కాదని, త్యాగం, విలువైన ఆదర్శాలు అని రుజువు చేశాయని అన్నారు.  లింక్‌‌‌‌డీన్‌‌‌‌ బ్లాగ్‌‌‌‌లో జేఎన్‌‌‌‌యూ ఘటనపై ఆయన స్పందించారు. ఛపక్‌‌‌‌ సినిమా రిస్క్‌‌‌‌లో పడుతుందని తెలిసినప్పటికీ నటి ఆ స్టెప్‌‌‌‌ తీసుకోవడం మనందరికీ ప్రేరణ కలిగిస్తుందని అన్నారు. ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘన విషయంలో మోడీ, షాలకు క్లీన్‌‌‌‌ చిట్‌‌‌‌ ఇచ్చేందుకు నిరాకరించిన ఎన్నికల కమిషనర్‌‌‌‌‌‌‌‌ లావాసా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా ఆయన వెనక్కు తగ్గకుండా  పోరాడాలన్నారు.

లెఫ్ట్‌‌వింగ్ వాళ్ల పనే

లోక్​సభ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, ఆప్​ను  ప్రజలు రిజెక్ట్​చేశారు.  అలాంటి వాళ్లు ఇప్పుడు తమ సొంత ప్రయోజనాల కోసం స్టూడెంట్స్​ను ఉపయోగించుకుంటున్నారు.  ఆందోళనలకు ఫుల్​స్టాప్​ పెట్టాలని జేఎన్​యూ స్టూడెంట్స్​ను కోరుతున్నా.    ఎటాక్​తో లెఫ్ట్​ వింగ్​ స్టూడెంట్స్​కు  సంబంధముందని పోలీసులు  తేల్చారు.- కేంద్రమంత్రి ప్రకాశ్​ జవదేకర్

వారికా… నీ సపోర్ట్​ : దీపిక పదుకొనె జేఎన్​యూ  వెళ్లడాన్ని తప్పుపట్టిన స్మృతి ఇరానీ 

చెన్నై: దుండగుల దాడుల్లో  గాయపడ్డ జవహర్​లాల్​ నెహ్రూ  యూనివర్సిటీ ( జేఎన్​యూ)  స్టూడెంట్స్​ను  బాలీవుడ్​ స్టార్​ దీపిక పదుకొనె పరామర్శించడాన్ని   కేంద్రమంత్రి స్మృతి ఇరానీ  తప్పుపట్టారు.  దేశాన్ని  విధ్వంసం చేయాలనుకునే వాళ్లకు సంఘీభావం తెలిపానని ఆమె తెలుసుకోవాలని ఇరానీ అన్నారు.   గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో  కేంద్రమంత్రి  పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్​ జవాన్లు చనిపోయినప్పుడు  గతంలో  జేఎన్​యూలో కొంతమంది సంబరాలు జరుపుకున్న అంశాన్ని ఆమె పరోక్షంగా గుర్తుచేశారు.  ఈ నెల 5న  జేఎన్​యూలో  జరిగిన గొడవలో గాయపడ్డ స్టూడెంట్స్​ను పరామర్శించేందుకు దీపిక బుధవారం  వర్సిటీకి వెళ్లారు.  దీపిక తీరుపై  బీజేపీ లీడర్లు, రైట్​ వింగ్​ గ్రూపు నాయకులు  ఫైర్​ అయ్యారు.  మూవీ ప్రచారం కోసమే ఆమె అక్కడకు వెళ్లారన్న  ఆ నేతలు.. దీపిక నటించిన ఛపాక్​ సినిమాను  బహిష్కరించాలని  పిలుపు నిచ్చారు.

Hundreds of ‘azaadi from Left’ posters plastered outside JNU, DU overnight