గుర్రం అంత్యక్రియలకు వందలాది మంది

గుర్రం అంత్యక్రియలకు వందలాది మంది

కరోనా సెకండ్ వేవ్ దాటికి చాలా కుటుంబాలు అతాలకుతలం అయ్యాయి. చివరి చూపు కూడా చూడని ఘటనలను మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల దిక్కుమొక్కు లేకుండా కూడా చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం. పెళ్లికి 100 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించిహాజరు కాకుడదని కేంద్రం కోవిడ్ గైడ్ లైన్స్ లో ఉంది. కానీ కొన్ని కోవిడ్ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారు. విచ్చలవిడిగా సోషల్ డిస్టెన్స్ లేకుండా హాజరవుతున్నారు. కానీ  కర్ణాటక బెళగావి జిల్లా మరాదిమత్ గ్రామంలో గుర్రం అంత్యక్రియలకు వందలాది మంది తరలి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఆదివారం జరిగింది. ఐతే అంతిమయాత్రలో ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించలేదు. ప్రస్తుతం కర్ణాటకలో లాక్ డౌన్ అమల్లో ఉంది. ఐనప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.