కొందరికి ఆకలి ఎక్కువగా అవుతుంది. దీంతో ఎప్పుడుపడితే అప్పుడు... ఏది పడితే అది తింటుంటారు. ఫలితంగా బరువు పెరిగిపోతారు. ఆకలి విషయంలో లెప్టిన్, గ్రెలిన్ అనే రెండు హార్మోన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈరెండు హార్మోన్లు అదుపులో ఉంటే బరువు పెరగరని నిపుణులు చెబుతున్నారు.
ఆహారం తిన్న తర్వాత కడుపు నిండిందనే విషయాన్ని లెప్టెన్ సూచిస్తే. ...ఆకలిగా ఉన్నామని, ఏదైనా తినాలని గెలిస్ సూచిస్తుంది. అందుకే ఈ రెండు హార్మోన్లను అదుపులో ఉంచుకుంటే ఆకలిని నియంత్రించుకోవచ్చు.
బరువు అధికంగా ఉన్న వారిలో లెప్టిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. లెప్టిన్ స్థాయి పెరిగి, గ్రెలిన్ స్థాయి తగ్గడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుని, బరువు తగ్గొచ్చు. ప్రొటీన్లు. పిండి పదార్ధాలు సమపాళ్లలో ఉండే ఆహారం తీసుకోవడం తీసుకోవాలి.
►ALSO READ | Health Tips: ఉసిరికాయ.. ఔషధాల గని.. ఇలా చేస్తే జుట్టు సమస్యలుండవు..!
ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా, మూడు నాలుగు గంటలకోసారి కొద్ది కొద్దిగా తినాలి.. ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వీటివల్ల క్రమంగా లెఫ్టిన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి, గెలిన్ స్థాయి తగ్గుతుంది. ఇది బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
