హైదరాబాద్‌ సిటీలో హంగర్ క్రాఫ్ట్స్ ప్రారంభం

హైదరాబాద్‌ సిటీలో హంగర్ క్రాఫ్ట్స్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: బీ2బీ కార్పొరేట్ క్యాటరింగ్, బీ2సీ మీల్ సర్వీసులను అందించడానికి హైదరాబాద్‌‌‌‌ కేంద్రంగా హంగర్ క్రాఫ్ట్స్  స్టార్టప్​ మొదలయింది. ఇది తన సబ్​–బ్రాండ్ తిండిఫై ద్వారా కొత్త ఆహార పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పించనుంది. ఈ సంస్థ కార్పొరేట్ పార్కులు, రెసిడెన్షియల్ కమ్యూనిటీలు ఈవెంట్లను లక్ష్యంగా చేసుకుని, పెద్ద ఎత్తున క్యాటరింగ్ సేవలను అందిస్తుంది. 

కొత్త ఫుడ్ ఎంట్రప్రెన్యూర్స్‌‌‌‌కి సాయపడుతుందని హంగర్ క్రాఫ్ట్స్ ఫౌండర్ ​వినీత్ అన్నారు. ఈ ఫ్రాంచైజ్ మీల్​ కాంబో మోడల్స్‌‌‌‌ను అందిస్తుంది. మొదట్లో రాయల్టీ, ఫీజులు వసూలు చేయదు. కొత్త ఔట్‌‌‌‌లెట్లకు అద్దెలో 50 శాతం మొత్తం సాయం చేస్తుంది.   2027 నాటికి 100 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంటామని, వచ్చే 24 నెలల్లో భారీగా విస్తరిస్తామని వినీత్ ​వివరించారు.