అమెరికాను వణికిస్తోన్న హరికేన్..65 మంది మృతి

అమెరికాను వణికిస్తోన్న హరికేన్..65 మంది మృతి

ఐడా హరికేన్ అమెరికాను వణికిస్తోంది. ఇప్పటికే 65 మంది ప్రాణాలు కోల్పోయారు. హరికేన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు న్యూజెర్సీ, న్యూయార్క్ లలో నలుగురు భారతీయ అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. న్యూజెర్సీలోని బ్రిడ్జ్  వాటర్  టౌన్  షిప్  ప్రాంతంలో మాలతి కంచె,  సౌత్  ప్లెయిన్  ఫీల్డ్  లో ధనుష్  రెడ్డి అనే యువకుడు వరద నీటిలో కొట్టుకుపోయి మరణించారు. సాఫ్ట్ వేర్  డిజైనర్  అయిన మాలతి తన 15 ఏళ్ల కుమార్తెతో కలసి బుధవారం కారులో వెళ్తుండగా.. వరద ప్రవాహం పెరిగి అందులో చిక్కుకుపోయారు. కారు నుంచి బయటపడి.. ఓ చెట్టును పట్టుకుని ఉన్నా.. అది గాలి తీవ్రతకు కూలిపోవంతో.. మాలతి గల్లంతయ్యారని.. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నట్టు అమెరికా అధికారులు చెప్పారు.

మరోవైపు రోడ్డుపై వెళ్తున్న ధనుష్ రెడ్డి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. రోడ్డుపై నుంచి.... భారీ సైజులో ఉన్న మురుగు పైపు లోకి జారిపోయాడు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. 8 కిలోమీటర్ల దూరంలో అతని డెడ్ బాడీ స్వాధీనం చేసుకున్నారు. న్యూయార్క్ లో దామేశ్వర్  రామ్స్  క్రీట్స్  ఇంట్లోకి వరద నీరు పోటెత్తడంతో ఆయన భార్య తారా, 22 ఏళ్ల కుమారుడు నిక్  చనిపోయారు. భార్యను కాపాడడానికి తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని దామేశ్వర్ చెప్పారు.