
మెదక్ జిల్లా:కరోనా దెబ్బకు ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నాయి. ఒకే ఫ్యామిలీలో వరుస మరణాలు జరుగుతున్నాయి. శనివారం కరోనాతో గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు చనిపోయిన విషాద సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ జిల్లా, చేగుంట పట్టణానికి చెందిన బచ్చు వెంకటేష్ (80), ఆయన భార్య బాలమని (75)కి ఇటీవల కరోనా సోకింది. భార్యాభర్తలిద్దరూ మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం బాలమని చనిపోయింది. భార్య చనిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన భర్త వెంకటేష్ సాయంత్రం మృతి చెందాడని తెలిపారు డాక్టర్లు. ఒకేరోజు ఇద్దరు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.