భార్య డెలివరీకి డబ్బులు లేవని భర్త సూసైడ్

భార్య డెలివరీకి డబ్బులు లేవని భర్త సూసైడ్
  • ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్
  • భార్య డెలివరీ ఖర్చులకు పైసలు లేవని మనస్తాపం

గజ్వేల్, వెలుగు: ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి సూసైడ్​చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం కేంద్రంలో జరిగింది. గ్రామస్తులు, గౌరారం ఎస్సై వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మొడుసు రాజిరెడ్డి(32) ప్రైవేట్​కంపెనీల్లోని మిషనరీకి తుప్పు పట్టకుండా పెయింటింగ్స్​ వేసే కాంట్రాక్ట్​పనులు చేసేవాడు. అయితే ఆరు నెలలుగా ఒక్క కాంట్రాక్ట్ ​కూడా దొరక్కపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఇతనికి రెండేళ్ల పాప, 8 నెలలు గర్భవతి అయిన భార్య అంజలి ఉన్నారు. ప్రస్తుతం డెలివరీ కోసం భార్య వాళ్ల పుట్టింటికి వెళ్లింది. కొద్దిరోజులుగా చేతిలో పైసలు లేవు.. కాన్పు దగ్గర పడుతుంది ఏం చేయాలె అని తల్లి అంజమ్మతో పలుమార్లు చెప్పి రాజిరెడ్డి బాధపడ్డాడు. ఈ క్రమంలోనే శుక్రవారం వేకువజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతసేపటికి గమనించిన తల్లి పొరుగువారి సాయంతో కిందికి దించగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అంజలి కన్నీరుమున్నీరయ్యింది. పోలీస్​ కేసు ఫైల్​ అయ్యింది.