అప్పుకింద పుస్తెలతాడు లాక్కెళ్లారని భర్త సూసైడ్

V6 Velugu Posted on Aug 04, 2021

నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. డబ్బు బాకీ ఉన్నాడని ఇంటికి వచ్చి ఇద్దరు వ్యక్తులు గొడవ చేయటంతో పాటు భార్య మెడలోంచి పుస్తెలతాడు లాక్కెళ్లారు. నగరంలోని నాందేవ్ వాడలో నివాసముండే నాగరాజు మార్కెట్ యార్డులో వడ్ల వ్యాపారం చేస్తాడు.  బద్ధం శ్రీనివాస్, లక్ష్మీనారాయణలకు లక్ష 40 వేలు బాకీ ఉన్నాడు. డబ్బుల కోసం.. తెల్లవారుజామున 4 గంటలకు నాగరాజు ఇంటి దగ్గర కాపు కాసిన బద్దం శ్రీనివాస్, లక్ష్మీనారాయణలు.. ఉదయం 6 గంటలకు ఇంట్లో చొరబడి భార్య అఖిల మెడలో పుస్తెలతాడు లాక్కొని వెళ్లారు. దీంత మనస్తాపం చెందిన నాగరాజు తన పరువు పోయిందని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నిందితులను అరెస్ట్ చేయాలంటూ  త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి అండదండలు ఉన్నాయంటూ అప్పు కోసం గొడవపడ్డ వ్యక్తులు బెదిరించారంటున్నారు నాగరాజు బంధువులు.

 

Tagged NIzamabad, debt, Mangalasutra, Husband suicide

Latest Videos

Subscribe Now

More News