మోమోస్ తినిపించలేదని భార్య ఏం చేసిందంటే..

మోమోస్ తినిపించలేదని భార్య ఏం చేసిందంటే..

పెళ్లైయ్యాక భార్య భర్తల మధ్య గొడవలు కామన్. ఈ గొడవలు రకరకాల కారణాల వల్ల వస్తాయి. ఉత్తరప్రదేశ్ లోని ఓ జంట మధ్య వచ్చిన గొడవ గురించి తెలిస్తే మీరు పక్కుమని నవ్వేస్తావు.  భార్య భర్తను డ్రెస్సులు, నగలు, సినిమాలకు తీసుకెళ్లమని అడగటం తరుచుగా చూస్తుంటాం. అయితే ఇక్కడ వింత ఏంటంటే?  ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళ తన భార్య మోమోస్ తినిపించడం లేదని పుట్టింటికి వెళ్లింది. అదే కారణంతో భర్తపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. మల్పురాకు చెందిన మహిళకు పినహట్ వాసితో 8 నెలల క్రితం వివాహమైంది. ఆవిడకు మోమోస్ అంటే చాలా ఇష్టం. పెళ్లికి ముందు  రోజూ మోమోస్ తినిపించాలని తన భర్తతో ఆమె ఓప్పందం కుదుర్చుకుంది. 

పెళ్లైన తర్వాత కొన్ని రోజులు ఆమె భర్త రోజు మోమోస్ తీసుకొచ్చాడు. తర్వాత పని హడావిడి, ఇతర కారణాలతో మోమోస్ తీసుకురావడం అతనికి కుదరలేదు. ఆ విషయంలో వారి మధ్య తరుచూ గొడవలు అయ్యేవి. ఒక రోజు భార్త మోమోస్ తేవడం లేదని భార్య పుట్టింటికి వెళ్లింది.  ఆమె భర్త మోమోస్ ఇప్పించడం లేదని ఏకంగా పోలీసులకు కంప్లైంట్ కూడా చేసింది. పోలీసులు ఆ జంట సమస్యను కౌన్సిలింగ్ ఇచ్చి పరిష్కరించారు. ఈ కౌన్సిలింగ్ లో వారానికి రెండు సార్లు మోమోస్ తినిపిస్తానని ఓప్పుకుంటే భార్య తన భర్తతో కాపురానికి వెళ్లింది.