లిఫ్​స్టిక్​ కోసం భర్తపై అలిగి.... పుట్టింటికి వెళ్లిన భార్య

లిఫ్​స్టిక్​ కోసం భర్తపై అలిగి.... పుట్టింటికి వెళ్లిన భార్య

 ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భార్య తన భర్తను వదిలి తన తల్లి ఇంటికి వెళ్లింది. అది కూడా ఆమె భర్త తనకు చౌకైన లిప్‌స్టిక్‌ బహుమతిగా ఇచ్చాడని… భార్యను ఒప్పించేందుకు భర్త తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆపై విషయం కాస్త పోలీసుల వరకు చేరింది. ఇద్దరికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించగా.. భర్త కొన్న లిప్ స్టిక్ విలువ రూ.30 మాత్రమే… తనకు బ్రాండెడ్ లిప్ స్టిక్ అంటే ఇష్టమని భార్య చెప్పింది.

ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలకే మనుషులు పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఎంతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా భార్యా భర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు పెద్దగా మారిపోయి .. చివరకు భార్య పుట్టింటికి వెళ్లే పరిస్థితులు దాపురిస్తున్నాయి. గొడవలు తలెత్తినప్పుడు ఇక భార్య భర్తలు సర్దుకోకుండ వాటిని పెద్దగా చేసుకుంటూ చివరికి ఏకంగా కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. 


ఇప్పుడు ఉత్తర్​ ప్రదేశ్​లోకి  వెలుగులోకి వచ్చినఘటన  అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. తనకు బ్రాండెడ్​ లిఫ్​ స్టిక్​ కొనివ్వలేదని భర్తతో గొడవ జరిగింది అనే కారణంతో వివాహిత పిల్లలతో సహా పుట్టింటికి  వెళ్లిపోయింది. తనకు బ్రాండెడ్​ లిఫ్​ స్టిక్​ కావాలని  భర్తను పలుమార్లు అడిగింది. ఒక రోజు  ఆమెకు రూ.30 విలువైన లిప్ స్టిక్ తీసుకొచ్చాడు. అది చూడగానే భార్య తల నిమిరింది. ఇకపై భర్తతో కలిసి ఉండకూడదని నిర్ణయించుకుంది. అనంతరం కొడుకుతో కలిసి తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది

 గత నెల రోజులుగా తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది. శనివారం  (మార్చి 2) ఇరువర్గాలను కౌన్సెలింగ్‌కు పిలిచినట్లు కౌన్సెలర్ సతీష్ ఖిర్వార్ తెలిపారు. భార్య అన్ని షరతులను భర్త అంగీకరించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య రాజీ కుదిరింది..తన భర్త తనకు ఎప్పుడూ తక్కువ ధరకే మేకప్ వస్తువులు కొంటాడని చెప్పింది. దీంతో ఆమె స్నేహితుల ముందు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ తర్వాత భార్య షరతులన్నీ భర్త అంగీకరించి వారి మధ్య రాజీ కుదిర్చాడు.

 భర్త తన బ్రాండెడ్ మేకప్ వస్తువులను కొనుగోలు చేయాలనే షరతుపై మాత్రమే తాను భర్త ఇంటికి వెళ్తున్నానని భార్య తెలిపింది. ఇంకోసారి అలాంటి తప్పు చేస్తే ... మళ్లీ పుట్టింటికి వెళ్లి.. ఒప్పించిన తర్వాత కూడా తిరిగి రానని చెప్పింది. భర్త కూడా ఇప్పుడు తన భార్యను మంచిగా చూసుకుంటానని చెప్పాడు. తనకు ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వవని చెప్పుకొచ్చాడు