ఎల్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు .. అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఎల్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు .. అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కాళ్లకు ఆరు కిలోల రెండు వెండి తొడుగులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బైండ్ల పూజారులతో కలిసి నృత్యం చేస్తూ భక్తులను ఉత్సాహపరిచారు. 

మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ ఎల్లమ్మ ఉత్సవాలు వైశాఖ పౌర్ణమి నుంచి ప్రారంభమై పౌర్ణమి వరకు జరుగుతాయన్నారు.  ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని వేడుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.