మోడీకి ముఖం చూపించలేని నాయకుడు కేసీఆర్

మోడీకి ముఖం చూపించలేని నాయకుడు కేసీఆర్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమయంలో టీఆర్ఎస్ కుట్రతోనే ఫ్లెక్సీలు పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.  మోడీ ఫ్లెక్సీల్లో లేకున్నా ప్రజల గుండెల్లో ఉన్నాడని చెప్పారు. బీజేపీ విజయసంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ ముఖం చూసి ప్రజలు విసిగిపోయారని.. మోడీకి ముఖం చూపించలేని నాయకుడు కేసీఆర్ అంటూ విమర్శించారు. దళితుడు, గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్..అధికారంలోకి వచ్చాక మాట మార్చిండన్నారు. కేసీఆర్ కు దళిత బిడ్డలమీద గౌరవముంటే ముర్ముకు మద్ధతు ఇవ్వాలని సవాల్ చేశారు.

కేసీఆర్ బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని..కానీ 27మంది ఓబీసీలకు మంత్రి పదువులు ఇచ్చని ఘనత మోడీదని ఈటల రాజేందర్ అన్నారు. ఎస్సీలకు, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించినట్లు చెప్పారు. దేశ ఔన్నత్యాన్ని పెంచిన నాయకుడు మోడీ అని.. ప్రపంచంలోనే ఆయన తిరుగులేని లీడర్ అని అన్నారు. దేశంలో 19మంది బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారని..తెలంగాణ నుండే 20వ సీఎం వస్తారని ఈటల దీమా వ్యక్తం చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమరి దాకా బీజేపీ జెండా ఎగురవేస్తదని..కలిసికట్టుగా బీజేపీని గెలిపించుకుందామని ఈటల పిలుపునిచ్చారు.