హుజూర్ నగర్లో ఫ్రీ జర్నీని వినియోగించుకోవాలి : గుడెపు శ్రీనివాస్

హుజూర్ నగర్లో ఫ్రీ జర్నీని వినియోగించుకోవాలి : గుడెపు శ్రీనివాస్

హుజూర్ నగర్ , వెలుగు : మహిళకు ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తున్న ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకోవాలని హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఎంపీపీ గుడెపు శ్రీనివాస్ సూచించారు. ఆదివారం మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్‌‌ గెల్లి అర్చన రవితో  కలిసి  ఆర్టీసీ బస్సులో  మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు .  అనంతరం ఏరియా ఆస్పత్రిలో రూ.10 లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు స్కీమ్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు.   ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి, ఆర్డీవో ఎన్ జగదీశ్వర్ రెడ్డి, తహసీల్దార్ నాగార్జున రెడ్డి,  ఏరియా ఆస్పత్రి సూపరిండెంట్ కరుణ్ కుమార్, కోదాడ డిపో మేనేజర్  శ్రీహర్ష,  కౌన్సిలర్లు గాయత్రి భాస్కర్, తన్నీరు మల్లిఖార్జున్, జగన్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

బస్టాండ్లలో రద్దీ

యాదాద్రి, వెలుగు : కార్తిక మాసం చివరి ఆదివారం కావడం, శుభకార్యాలు ఉండడంతో బస్సుల్లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. దీనికి తోడు మహాలక్ష్మి కింద మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం రావడంతో బస్సుల్లో మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తున్నారు. బస్సుల కోసం జిల్లాలోని భువనగిరి, ఆలేరు సహా అన్ని బస్టాండ్లలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఎదురు చూడడం కనిపించింది. హైదరాబాద్​, హన్మకొండ, నల్గొండ, తొర్రూరు, యాదగిరిగుట్ట నుంచి వచ్చిన బస్సులు ప్రయాణికులతో నిండుగా వచ్చాయి.