హుజూర్‌నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా సంపత్ రెడ్డి

హుజూర్‌నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా సంపత్ రెడ్డి

హుజుర్‌నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ హస్తగతమైంది.  3 వ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత వైస్ చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావుపై జనవరి24 న కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం మున్సిపల్ కార్యాలయంలో  ప్రిసైడింగ్ ఆఫీసర్‌‌ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి  ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. మున్సిపాలిటీలో 28 మంది సభ్యులు ఉండగా..  24 మంది హాజరయ్యారు. వైస్ చైర్మన్‌ రేసులో ఉన్న 11 వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్

మరో ముగ్గురు బీఆర్‌‌ఎస్‌ కౌన్సిలర్లు   గైర్హాజరయ్యారు . 12 వ వార్డు కౌన్సిలర్ వెలిదండ సరిత వైస్ చైర్మన్ అభ్యర్థిగా 3వ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డిని ప్రతిపాదించగా 22 వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన సతీష్ బలపరిచారు.  పోటీలో ఎవరు లేకపోవడంతో  సంపత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీవో ప్రకటించారు. అనంతరం నియామక పత్రం అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.

తర్వాత ఆర్డీవో, కమిషనర్‌, మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనా రవి , కౌన్సిలర్లు సంపత్‌రెడ్డిని సన్మానించారు.    ఈ కార్యక్రమంలో డీఏవో కాశీ నారాయణ, మున్సిపల్ కమిషనర్ కె .శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు .