హైదరాబాద్, వెలుగు: దేశ వ్యాప్తంగా మెడికల్, హెల్త్ కేర్ విభాగాల్లో అమూల్యమైన సేవలను అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిని హైబిజ్ టీవీ సత్కరించింది. హైబిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ 4వ ఎడిషన్‌లో భాగంగా 60 మందికి పైగా వీటిని అందజేసింది. వరుసగా నాలుగో ఏడాది హైబిజ్ టీవీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
హైదరాబాద్‌లోని హెచ్.ఐ.సి.సి నోవాటెల్‌లో జరిగిన ఈ అవార్డ్ ప్రోగ్రాంకు ఎ. రామ్ కిషన్ (డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ , భారత ప్రభుత్వం), బి. భాస్కర్ రావు (కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్), ఆశిష్ మణివణ్ణన్ (వైస్ ఛైర్మన్, మహేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్), వెంకట్ రవి కుమార్ టీ (బ్రాండ్ మార్కెటింగ్, అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వీరితో పాటు సవితా సుఖ్ దేవ్ (రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డైరెక్టర్ ), శ్రీధర్ కస్తూరి (ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్), ఎం. రాజ్ గోపాల్ ( మేనేజింగ్ డైరెక్టర్ - హైబిజ్ టీవీ అండ్ తెలుగు నౌ), జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్టర్ - హైబిజ్ టీవీ ఎల్.ఎల్.పి) తదితరులు పాల్గొన్నారు. హైబిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ 4వ ఎడిషన్‌లో భాగంగా కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ బి. భాస్కర్ రావును ప్రతిష్టాత్మక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారంతో సత్కరించారు. 11 హాస్పిటల్స్‌కు పురస్కారాలు దక్కాయి.