న్యూఢిల్లీ: ఐసీఎల్ ఫైనాన్స్, సెక్యూర్డ్ నాన్- కన్వర్టిబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) పబ్లిక్ ఇష్యూను ఈ నెల నవంబర్ 17 ప్రారంభించనుంది. ఈ ఇష్యూ నవంబర్ 28 వరకు ఉంటుంది. ఇది గరిష్టంగా 12.62 శాతం వరకు రాబడిని అందిస్తుంది. ఎన్సీడీ ముఖ విలువ రూ.వెయ్యి కాగా, కనీస పెట్టుబడి రూ. 10వేలు. ఈ ఇష్యూకు క్రిసిల్ బీబీబీ-/స్టేబుల్ రేటింగ్ ఉందని ఐసీఎల్ ప్రకటించింది.
13, 24, 36, 60 70 నెలల టెనార్లలో నెలవారీ, వార్షిక, సంచిత వడ్డీ ఆప్షన్లు ఉన్నాయి. ఐసీఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్స్, హైర్ పర్చేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ అందిస్తుంది. ఈ పెట్టుబడులను సంస్థ వృద్ధికి ఉపయోగిస్తారమని సీఎండీ అనిల్ కుమార్ వివరించారు.
