యుటోపియా థెరప్యూటిక్స్కు నిధులు

యుటోపియా థెరప్యూటిక్స్కు నిధులు

హైదరాబాద్​, వెలుగు: దీర్ఘకాలిక జీవక్రియ వ్యాధుల కోసం తదుపరి తరం వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌లను అభివృద్ధి చేస్తున్న బయోటెక్ కంపెనీ యుటోపియా థెరప్యూటిక్స్,   వేల్ ట్యాంక్ నుంచి 1.5 మిలియన్ ​డాలర్ల సీడ్ ఫండింగ్‌‌‌‌‌‌‌‌ను పొందినట్లు వెల్లడించింది.  ఊబకాయాన్ని తగ్గించడానికి యుటోపియా  లీడ్ ఇమ్యునోథెరపీటిక్ క్యాండిడేట్ అయిన యూటీ009  ప్రీక్లినికల్ అభివృద్ధిని ఈ నిధులు వేగవంతం చేస్తాయి . ఇది లిపిడ్- సంబంధిత యాంటిజెన్‌‌‌‌‌‌‌‌లను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. ఈ వ్యాక్సిన్​ జీవక్రియ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని యుటోపియా తెలిపింది.