జమ్మూ: జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–డి మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. జమ్మూ బౌలర్లు సునీల్ కుమార్ (5/29), అఖీబ్ నబీ (4/39) దెబ్బకు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో 88/6 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం (నవంబర్ 17) రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 39.2 ఓవర్లలో 121 రన్స్‌కే ఆలౌటైంది.
తనయ్ త్యాగరాజన్ (16), రక్షణ్ రెడ్డి (11), కార్తికేయ (10), అనికేత్ రెడ్డి (3) నిరాశపర్చారు. దాంతో 33 రన్స్‌కే ఈ నలుగురు ఔటయ్యారు. 49 రన్స్ తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జమ్మూ కశ్మీర్ ఆట ముగిసే టైమ్‌కు 71 ఓవర్లలో 275/4 స్కోరు చేసింది. అబ్దుల్ సమద్ (77 బ్యాటింగ్), కన్హయ్య వాధవన్ (82 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఖమ్రాన్ ఇక్బాల్ (50), వివ్రాంత్ శర్మ (45) మెరుగ్గా ఆడారు. శుభమ్ ఖజురియా (5), పారస్ డోగ్రా (5) నిరాశపర్చారు. రక్షణ్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా జమ్మూ కశ్మీర్ 324 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
