దూసుకెళ్తున్న హైదరాబాద్..భారీగా పెరుగుతున్న జీడీపీ

దూసుకెళ్తున్న హైదరాబాద్..భారీగా పెరుగుతున్న జీడీపీ

హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాల్లో హైదరాబాద్‌కు చోటు దక్కింది.  2019– 2035 మధ్యకాలంలో హైదరాబాద్  జీడీపీ వృద్ధి రేటు భారీగా ఉంటుందని నైట్​ఫ్రాంక్​, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) రిపోర్ట్​ వెల్లడించింది. ఇది ఏటా 8.47 శాతం వృద్ధి చెందే అవకాశం ఉంది. 

2018లో హైదరాబాద్ జీడీపీ స్థిరమైన ధరలలో 50.6 బిలియన్ల డాలర్ల వద్ద ఆకట్టుకుంది. ఇది 2035 నాటికి 201.4 బిలియన్ల డాలర్లకు ఎగబాకుతుందని అంచనా. రిపోర్టులో హైదరాబాద్​ నాల్గవ స్థానంలో ఉండగా, సూరత్, ఆగ్రా,  బెంగళూరు మొదటి మూడుస్థానాల్లో ఉన్నాయి. 'ఇండియా రియల్ ఎస్టేట్: ఎ డికేడ్ ఫ్రమ్ నౌ 2024' పేరుతో రూపొందించిన నివేదిక, వచ్చే దశాబ్దంలో ఆర్థిక,  రియల్ ఎస్టేట్ రంగ ఎదుగులను విశ్లేషిస్తుందని నైట్ ఫ్రాంక్​తెలిపింది. రియల్​ఎస్టేట్​దేశీయ,  అంతర్జాతీయ కంపెనీల నుంచి వివిధ రకాల పెట్టుబడులను ఆకర్షిస్తాయి. 

ఇది వరకే బెంగళూరు, పుణే, హైదరాబాద్​ కలిసి 20 బిలియన్​ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ నగరాల్లో ఐటీ వల్ల స్థలాలకు విపరీతంగగా గిరాకీ ఉంటుంది. 2004 నుంచి 24.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ముంబై మొదటిస్థానంలో ఉంది. జాతీయ రాజధాని ప్రాంతం  11.7 బిలియన్ల డాలర్ల పెట్టుబడులను సంపాదించింది.