అడ్‌‌కాక్లో నాట్కో వాటా కొనుగోలు పూర్తి

అడ్‌‌కాక్లో నాట్కో వాటా కొనుగోలు పూర్తి

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాకు చెందిన అడ్‌‌కాక్ ఇన్‌‌గ్రామ్ హోల్డింగ్స్‌‌లో 35.75 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్టు హైదరాబాద్​ ఫార్మా కంపెనీ నాట్కో ప్రకటించింది. ఇందుకోసం అడ్‌‌కాక్  ఈ నెల  11న జోహన్నెస్‌‌బర్గ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (జేఎస్​ఈ) నుంచి డీలిస్ట్ అయింది. 

ఈ లావాదేవీ విలువ సుమారు 226 మిలియన్​ డాలర్లు. అడ్‌‌కాక్ ఇన్‌‌గ్రామ్ పాండో, మైప్రోడోల్, ఎపి-మాక్స్, సిట్రో-సోడా అలెర్గెక్స్ వంటి బ్రాండ్‌‌లకు ప్రసిద్ధి చెందింది.  బీఎస్​ఈలో నాట్కో ఫార్మా షేర్లు బుధవారం 3.82 శాతం పెరిగి రూ. 823.20 వద్ద ముగిశాయి.