ప్రైమ్ వాలీబాల్ లీగ్‌‌లో .. బ్లాక్‌‌‌‌‌‌‌‌హాక్స్‌‌‌‌‌‌‌‌ మూడో ఓటమి

ప్రైమ్ వాలీబాల్ లీగ్‌‌లో .. బ్లాక్‌‌‌‌‌‌‌‌హాక్స్‌‌‌‌‌‌‌‌ మూడో ఓటమి

చెన్నై:  ప్రైమ్ వాలీబాల్ లీగ్‌‌లో హైదరాబాద్ బ్లాక్‌‌హాక్స్‌‌‌‌‌‌‌‌ జట్టు మూడో  మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఓడింది. సోమవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఢిల్లీ తూఫాన్స్  15-–11, 13-–15, 15–-9, 15–-11 తో బ్లాక్ హాక్స్‌‌‌‌‌‌‌‌ను ఓడించి ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఢిల్లీ  రెండో విజయం సొంతం చేసుకుంది. బ్లాక్ హాక్స్ ఆటగాళ్లు ఇవాన్ ఫెర్నాండెజ్,  అషామత్ ఉల్లా, హేమంత్ పోరాడినా ఫలితం లేకపోయింది.ప్లేయర్​ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన సంతోష్‌‌‌‌‌‌‌‌తో పాటు లేజర్ డోడిక్ స్టెఫాన్ కోవాసెవిక్ ఢిల్లీని  గెలిపించారు.