ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వాలీబాల్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌హాక్స్‌‌‌‌‌‌‌‌ కోల్‌‌‌‌‌‌‌‌కతాపై ఓటమి

ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వాలీబాల్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌హాక్స్‌‌‌‌‌‌‌‌  కోల్‌‌‌‌‌‌‌‌కతాపై ఓటమి

చెన్నై: ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వాలీబాల్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌హాక్స్‌‌‌‌‌‌‌‌ మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 8–15, 8–15, 15–11, 15–11, 18–20తో కోల్‌‌‌‌‌‌‌‌కతా థండర్‌‌‌‌‌‌‌‌బోల్ట్స్‌‌‌‌‌‌‌‌ చేతిలో పరాజయం పాలైంది. బ్లాక్‌‌‌‌‌‌‌‌హాక్స్‌‌‌‌‌‌‌‌ కీలక ప్లేయర్లు హేమంత్‌‌‌‌‌‌‌‌, జోసెఫ్‌‌‌‌‌‌‌‌, లాల్‌‌‌‌‌‌‌‌ సుజన్‌‌‌‌‌‌‌‌ అంచనాలను అందుకోలేకపోయారు. 

వినీత్‌‌‌‌‌‌‌‌, అమిత్‌‌‌‌‌‌‌‌ కుకూర్‌‌‌‌‌‌‌‌లు కోల్‌‌‌‌‌‌‌‌కతాకు పాయింట్లు అందించారు. కోల్‌‌‌‌‌‌‌‌కతా మిడిల్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌ అశ్వల్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌ ‘గేమ్‌‌‌‌‌‌‌‌ ఛేంజర్‌‌‌‌‌‌‌‌’ అవార్డు అందుకోగా, వినీత్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ లభించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.