ప్రైమ్‌‌ వాలీబాల్‌‌ లీగ్‌‌ లో పోరాడి ఓడిన హైదరాబాద్‌‌ బ్లాక్‌హాక్స్‌

ప్రైమ్‌‌ వాలీబాల్‌‌ లీగ్‌‌ లో  పోరాడి ఓడిన హైదరాబాద్‌‌ బ్లాక్‌హాక్స్‌

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రైమ్‌‌ వాలీబాల్‌‌ లీగ్‌‌ (పీవీఎల్‌‌)లో హైదరాబాద్‌‌ బ్లాక్‌హాక్స్‌‌ హ్యాట్రిక్‌‌ పరాజయాలను నమోదు చేసింది. గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో అహ్మదాబాద్‌‌ డిఫెండర్స్‌‌ 3–2 (9–15, 7–15, 15–9, 15–11, 15–8)తో బ్లాక్‌‌ హాక్స్‌‌పై గెలిచింది. 

తొలి రెండు సెట్లలో అద్భుతంగా ఆడిన హైదరాబాద్‌‌ తర్వాతి మూడు సెట్లలో నిరాశపర్చింది. అహ్మదాబాద్‌‌ ప్లేయర్ల  బలమైన షాట్లను తీయలేకపోయింది. మరో మ్యాచ్‌‌లో ఢిల్లీ తూఫాన్స్‌ 3–0 (15–11, 15–9, 15–11)తో కాలికట్‌‌ హీరోస్‌‌పై నెగ్గింది.