హైదరాబాద్ బిల్డర్.. కర్ణాటక బీదర్ లో మర్డర్.. అసలేం జరిగింది

హైదరాబాద్ బిల్డర్.. కర్ణాటక బీదర్ లో మర్డర్.. అసలేం జరిగింది

హైదరాబాద్ లో దారుణం జరిగింది. చింతల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ చింతల్లో నివసిస్తున్న బిల్డర్ మధును మే 24 2024 నాడు అదృశ్యమైయ్యాడు. ఇంటాయిన ఇంకా రోజులు గడుస్తున్న రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే బీదర్ సమీపంలో మధు మృతదేహం లభ్యమైంది. 

మధును కిడ్నాప్ చేసి హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. మధు దగ్గర ఉన్న రూ.5 లక్షల విలువైన ఆభరణాలు మాయమైనట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మధు మిస్సింగ్ పై ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఇప్పుడు మధు హత్యకు గురికావడంతో కేసు నమోదు చేయబోతున్నట్టు సమాచారం. మరోవైపు హత్య చేసింది ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.