రూ.200తో 50వేల టెస్టులు చేసేలా సీసీఎంబీ పరిశోధనలు

రూ.200తో 50వేల టెస్టులు చేసేలా సీసీఎంబీ పరిశోధనలు
  • సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా వెల్లడి

హైదరాబాద్: కరోనా తర్వాత టెక్నాలజీ.. పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి, కేవలం 200 రూపాయల ఖర్చుతో 50వేల కరోనా టెస్టులు చేసేలా సీసీఎంబీ పరిశోధనలు చేస్తోంది. తొందర్లోనే ఇది సాకారం అవుతుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో పీపీఈ కిట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని గుర్తు చేస్తూ.. మన టెక్నాలజీతో ఇప్పుడు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. భవిష్యత్ తరాల కోసం పర్యావరణం  కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా టెస్టులతోపాటు యాంటీ బాడీ టెస్టులు కూడా తక్కువ ఖర్చుతో జరిగేలా కొత్త టెక్నాలజీ సీసీఎంబీ ద్వారా అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. డిస్ ఇన్ఫెక్టర్స్ కోసం సీసీఎంబి ల్యాబ్లో  కొన్ని వందల డ్రగ్స్ పై ప్రయోగాలు చేస్తున్నామని.. సాధారణంగా కొత్త వ్యాక్సిన్ తయారీకి 8 నుంచి 10 ఏళ్లు పడుతుంది.. కానీ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేవలం ఏడాది లోపే కరోనా వ్యాక్సిన్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్ రావడం తెలంగాణకు గర్వకారణమన్నారు.

ఇవి కూడా చదవండి

రెస్టారెంట్ సిబ్బందికి కరోనా.. భయాందోళనలో భోజన ప్రియులు

టీఆర్ఎస్, బీజేపీలను ఓడిస్తే.. ప్రభుత్వాలు దిగొచ్చి ధరలు తగ్గిస్తాయి