
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం పూట జనం బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రతతో జిల్లాలో పొలం పనులకు వెళ్లే రైతులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో మంచు కమ్మేసింది. ఎల్బీనగర్, హమత్ నగర్, వనస్థలిపురం, హస్తీనాపురం, నాగోల్ ప్రాంతాల్లో కమ్మెసిన మంచుతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.