ఎన్డీఏ హయాంలోనే హైదరాబాద్ సిటీ అభివృద్ధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

ఎన్డీఏ హయాంలోనే హైదరాబాద్ సిటీ అభివృద్ధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

జూబ్లీహిల్స్, వెలుగు: ఎన్​డీఏ హయాంలోనే హైదరాబాద్​ నగర అభివృద్ధికి అడుగులు పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. మంగళవారం ఎర్రగడ్డ డివిజన్​లోని కల్పతరు రెసిడెన్షియల్ అపార్ట్​మెంట్ క్లబ్ హౌస్ లో ఆయన కాలనీవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు కాలనీల మధ్య నివాసాలకు ఆనుకొని శ్మశానవాటికకు ప్రభుత్వం అనుమతించడం విడ్డూరంగా ఉందన్నారు. 

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానిగా వాజ్​పేయి ఉన్నప్పుడే హైదరాబాద్ అభివృద్ధికి పునాదులు పడ్డాయన్నారు. ఎన్​డీఏ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు సహకారంతో గచ్చిబౌలి స్టేడియం, సైబర్ సిటీ వంటి ప్రాజెక్టులు వచ్చినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ బైపోల్​లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు.