హైదరాబాద్‌‌ కంపెనీ ఎంటార్‌‌‌ లాభం రూ.44.3 కోట్లు

హైదరాబాద్‌‌ కంపెనీ ఎంటార్‌‌‌ లాభం రూ.44.3 కోట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌ కంపెనీ ఎంటార్‌‌‌‌ టెక్నాలజీస్ లిమిటెడ్‌‌ ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌ (క్యూ4) లో రూ.44.3 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటేడాది డిసెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ.34.7 కోట్లతో పోలిస్తే ఇది 27.7 శాతం, మార్చి క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ.13.7 కోట్లతో పోలిస్తే 222.3 శాతం ఎక్కువ.

క్లీన్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్, ఏరోస్పేస్,  డిఫెన్స్ రంగాలకు అవసరమైన విడిభాగాలను తయారు చేసే ఈ సంస్థ, క్యూ4లో రూ.306.1 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.  పూర్తి 2025–26 ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే కంపెనీ నికర లాభం ఏడాది లెక్కన 76 శాతం పెరిగి రూ.94 కోట్లకు చేరుకుంది. 2024–25 లో 53.4 కోట్ల నికర లాభాన్ని సాధించింది.  రెవెన్యూ రూ.676 కోట్ల నుంచి రూ.876 కోట్లకు ఎగిసింది. ఇది 29.6 శాతం పెరుగుదల.