బ్లూటూత్​ కాలింగ్​తో  ‘రిథమ్​’ సన్‌‌‌‌‌‌‌‌‌‌ గ్లాసెస్‌‌‌‌

బ్లూటూత్​ కాలింగ్​తో  ‘రిథమ్​’ సన్‌‌‌‌‌‌‌‌‌‌ గ్లాసెస్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: యాక్సెసరీస్‌‌‌‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌‌‌‌ కంపెనీ కనెక్ట్‌‌‌‌ గ్యాడ్జెట్స్‌‌‌‌ రిథమ్‌‌‌‌ పేరుతో బ్లూటూత్‌‌‌‌ కాలింగ్‌‌‌‌ స్మార్ట్‌‌‌‌ సన్‌‌‌‌ గ్లాసెస్‌‌‌‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ గ్లాసెస్​తో ఎండ నుంచి కళ్లకు రక్షణ పొందడంతో పాటు ఫోన్‌‌‌‌ కాల్స్‌‌‌‌ అందుకోవచ్చు. సంగీతం వినొచ్చు.  పాటలు వింటున్నప్పుడు ఇందులోని బిల్ట్‌‌‌‌ ఇన్‌‌‌‌ మైక్రోఫోన్, స్పీకర్స్‌‌‌‌తో కాల్స్​ మాట్లాడవచ్చని కంపెనీ కో–ఫౌండర్‌‌‌‌ ప్రదీప్‌‌‌‌ యెర్రగుంట్ల తెలిపారు. మార్కెట్లోకి విడుదల చేసిన మూడు రోజుల్లోనే 20,000 యూనిట్లు అమ్ముడయ్యాయని చెప్పారు. దీని ధర రూ.6,999  కాగా, స్పెషల్‌‌‌‌ లాంచ్‌‌‌‌ ఆఫర్‌‌‌‌లో  రూ.1,999 లకే అమ్ముతున్నట్టు పేర్కొన్నారు. ఇందులోని బ్లూటూత్‌‌‌‌ ద్వారా స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌కు కనెక్ట్‌‌‌‌ చేసుకుని సౌండ్​ను ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు, పాటలను మార్చుకోవచ్చు. వాయిస్‌‌‌‌ కమాండ్స్‌‌‌‌ను యాక్టివేట్‌‌‌‌ చేయవచ్చు.