మీడియా అక్రిడిటేషన్ కమిటీ మార్పు

మీడియా అక్రిడిటేషన్ కమిటీ మార్పు
  • కలెక్టర్ మారగానే మార్చేశారు 
  • ఒకే నంబర్ తో రెండు ప్రొసీడింగ్స్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: వారం క్రితం వరకు హైదరాబాద్​కలెక్టర్​గా ఉన్న హరిచందన వేసిన హైదరాబాద్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని మార్చేశారు. గత నెల మూడో వారంలో 2026–28 అక్రిడిటేషన్​కమిటీని ఏర్పాటు చేయగా, ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్  ప్రొసీడింగ్(నంబర్ 010432) కూడా విడుదల చేశారు. ఎన్నికైనట్లు సభ్యుల నుంచి సంతకాలు సేకరించి ప్రొసీడింగ్స్​అందజేశారు. అయితే, ఏప్రిల్ 25న హరిచందన బదిలీ కాగా, కొత్త కలెక్టర్ గా ప్రియాంక​ఆల 26న బాధ్యతలు చేపట్టారు. అనూహ్యంగా నాలుగు రోజులకే కమిటీని రద్దు చేశారు. 

అయితే ఈ కమిటీకి కూడా పాత నంబర్​010432తోనే ప్రొసీడింగ్స్​విడుదల చేశారు. హరిచందన సీనియారిటీ ప్రకారం సభ్యులకు అవకాశం కల్పించారు. కమిటీ ఎన్నికైన తర్వాత ఒత్తిడి వచ్చినా ఒప్పుకోలేదు. అంతలోనే ఆమె బదిలీ కావడం.. కొత్త కలెక్టర్​రావడం.. కమిటీ మార్చడం చకచకా జరిగిపోయాయి. తమకు నచ్చిన వాళ్లను కమిటీలో కూర్చోబెట్టుకోవడానికి డీపీఆర్వో, ఏపీఆర్వో కలెక్టర్​ను తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.