
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ హోమ్ ఇంటీరియర్స్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోందని వెల్లడయింది. మ్యాజిక్‌బ్రిక్స్ తాజా రిపోర్ట్ ప్రకారం, ఈ మార్కెట్ విలువ 2030 నాటికి 2.9 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.
ఇండ్ల యజమానులు ఇంటీరియర్స్‌పై సగటున రూ. 4.9 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇది ఢిల్లీ (రూ. 5.8 లక్షలు) బెంగళూరు (రూ. 5.2 లక్షలు) కంటే తక్కువ. మంచి ఇంటీరియర్స్ కారణంగా ఆస్తి విలువ 70 శాతం వరకు, అద్దె విలువ 10-45 శాతం వరకు పెరగవచ్చు.
డిమాండ్ ఎక్కువగా 2బీహెచ్‌కే 3బీహెచ్‌కే ఇళ్లలో ఉంది. రూ. 75 లక్షల నుంచి రూ. 5 కోట్ల మధ్య ధర కలిగిన ఇండ్లు 49 శాతం మార్కెట్‌ను ఆక్రమించాయి. 60 శాతం కంటే ఎక్కువ మంది ఇంటీరియర్స్‌పై రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఖర్చులో ఎక్కువ భాగం బెడ్‌రూమ్స్ (సగటు రూ. 1.7 లక్షలు) కిచెన్స్ (సగటు రూ. 1.5 లక్షలు)పై ఉందని రిపోర్ట్
వెల్లడించింది.