
గృహిణులు, డెలివరీ ఏజెంట్లు, ఇతర కార్మికులు తమ భవనంలోని లిఫ్ట్‌ను ఉపయోగించవద్దని హైదరాబాద్ లోని ఓ హౌసింగ్ సొసైటీ కోరింది. అంతే కాదు ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా విధిస్తామని నోటీసులు కూడా జారీ చేశారు. ఎలివేటర్‌పై ఉన్న ఓ వివాదాస్పద నోటీసుకు సంబంధించిన చిత్రం నవంబర్ 28న సోషల్ మీడియాలో కనిపించి.. అందర్నీ విస్తుపోయేలా చేసింది.
ఓ X యూజర్ షహీనా అత్తర్వాలా ఈ నోటీసు చిత్రాన్ని పోస్ట్ చేసి, దానిపై విమర్శనాత్మక నోట్ ను వదిలారు. ఈ సమాజంలో మనం డార్క్ అండ్ డర్టీ సీక్రెట్స్ ను దాచడానికి ప్రోగ్రామ్ చేయబడ్డాం. ఈ రోజు మనం కష్టపడి పనిచేసే వ్యక్తులతో కలిసి జీవించలేమని భావిస్తున్నాం. ఒకవేళ వారు పట్టుబడితే రూ.1000 జరిమానా విధిస్తారా? ఇది నేరమా? ఇది బహుశా వారి జీతంలో 25% కావచ్చు అని ఆమె క్యాప్షన్ లో తెలిపింది.
నెటిజన్లు ఏమంటున్నారంటే..
అన్యాయమైన నిబంధనలను విధించినందుకు ఈ హౌసింగ్ సొసైటీలను నెటిజన్లు నిందించడంతో ఈ పోస్ట్ ట్విట్టర్‌లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. అన్ని జంతువులూ సమానమే.. కానీ కొన్ని ఇతరులకన్నా ఎక్కువ సమానం - ఆర్వెల్ అని పీయూష్ గాంధీ ఓ యూజర్ వ్యాఖ్యానించారు. చాలా బాధాకరమైన విషయం.. అందరూ దీన్ని ఖండించాలి అని మరొకరన్నారు. సర్వీస్ లిఫ్ట్‌లను ఉపయోగించమని కార్మికులను అడగడం అమానవీయం గానీ, వివక్షత గానీ కాదు. అది వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని నోటీసుకు అనుకూలంగా కొందరు వ్యాఖ్యానించారు.
As a society we are programmed to hide our dark and dirty secrets and today we think the people who do our hard labour work cannot coexist in a same space as we are. Incase they are caught? Like it’s a crime? Fine of 1000? It’s probably 25% of most of their salary. pic.twitter.com/bmwkcs37J9
— Shaheena A شاہینہ (@RuthlessUx) November 26, 2023