20 రోజుల ముందే హైదరాబాద్ కు ఎండాకాలం

20 రోజుల ముందే హైదరాబాద్ కు ఎండాకాలం

మార్చి నెల రానే రాలేదు.. తెలంగాణలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా అయితే ఎండలు మార్చి నెలలో మొదలై  ఏప్రిల్, మే నెల మెుత్తం ఉంటాయి. కానీ  సూర్యుడు ఫిబ్రవరి నెల నుంచే దంచుతున్నాడు. పగలు బయటకు వెళ్లాలంటే జనాలు భయపడుతున్నారు.   రోజు రోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. 

రాష్ట్రంలో దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.  దీంతో 32 నుంచి 37 డిగ్రీ ల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వెల్లడించారు.  మార్చి మొదటి వారం నుంచి వేసవి ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉందని అంచానా వేశారు.  వాస్తవానికి అయితే మార్చి 21 నుంచి వేసవి ప్రభావం ఎక్కవగా ఉంటుందని, కానీ ఈ ఏడాది 20 రోజుల ముందు నుంచి భగభగ మండే ఎండలు మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు.   

also read :  గొర్రెల స్కాం నిందితుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి
 

హైదరాబాద్  వాతావరణ శాఖకు చెందిన  డాక్టర్ ఎ శ్రావణి మాట్లాడుతూ..  మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని  తెలిపారు.  ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  వేసవి కాలం పూర్తిగా ప్రారంభం కాకముందే ఇంతగా ఎండలు కొడుతుంటే ఇక రాను రాను పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.