హైదరాబాద్, వెలుగు: ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ కోసం చారిటీ బిబ్స్‌ను నేషనల్ మారథాన్ రికార్డు హోల్డర్ సావన్ బార్వాల్ మంగళవారం అధికారికంగా ప్రారంభించాడు. దీని ద్వారా రన్నర్లు కేవలం హెల్త్ కోసం పరుగెత్తడమే కాకుండా ఈ ఈవెంట్ పార్ట్‌నర్స్‌గా ఉన్న 35 ఎన్జీవోల ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్, ఎన్విరాన్మెంట్ వంటి సామాజిక ప్రయోజనాల కోసం నిధులు సేకరిస్తామని మారథాన్ ఆర్గరైజర్ హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ తెలిపింది.

