28 వేల మంది రన్నర్లతో హైదరాబాద్ మారథాన్‌‌

28 వేల మంది రన్నర్లతో హైదరాబాద్ మారథాన్‌‌

హైదరాబాద్, వెలుగు: ఎన్‌‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 14వ ఎడిషన్‌‌ ఆగస్టు 23, 24 తేదీల్లో జరగనుంది. రికార్డు స్థాయిలో 28 వేల మంది పోటీ పడనున్నారు. మారథాన్ జెర్సీ, మెడల్‌‌ను సోమవారం స్టార్ బాక్సర్‌‌‌‌ నిఖత్ జరీన్ ఆవిష్కరించింది. ఈ మారథాన్ ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహనను పెంచుతుందని, ఫిట్‌‌నెస్‌‌ను జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని ప్రోత్సహిస్తుందని చెప్పింది. కాగా, ఆగస్టు 23న 5కె ఫన్ రన్‌‌ జరుగుతుందని, 24న ఫుల్ మారథాన్‌‌, హాఫ్ మారథాన్, 10కె రన్‌‌  పీపుల్స్ ప్లాజా నుంచి మొదలై  గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌లో ముగుస్తుందని రేస్ డైరెక్టర్ రాజేష్ తెలిపారు.