బీ అలర్ట్ : హైదరాబాద్లో ఈ రెండు మెట్రో స్టేషన్లు మూసివేత

బీ అలర్ట్ : హైదరాబాద్లో ఈ  రెండు మెట్రో స్టేషన్లు మూసివేత

హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. రెండు మెట్రో స్టేషన్లను రెండు గంటలపాటు మూసివేయనున్నట్లు ప్రకటించింది హైదరాబాద్ మెట్రో. 2023, నవంబర్ 27వ తేదీ అంటే.. సోమవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి.. ఆరు గంటల 30 నిమిషాల వరకు.. అంటే 2 గంటలు.. చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు మెట్రో అధికారులు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. 

ముషీరాబాద్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ప్రధాని మోదీ రోడ్‌షో  మొదలవుతుంది. అనంతరం సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్‌పేట్, యాకత్‌పురా, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, ఎల్‌బీ నగర్, మహేశ్వరం, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, మేడ్చల్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, నాంపల్లి, కార్వాన్, శేర్లింగంపల్లి, చార్మినార్, రాజేంద్రనగర్ మీదుగా కొనసాగి  గోషామహల్‌లో ముగుస్తుంది. 

ఈ ఏరియాల్లో ఉండే మైట్రో స్టేషన్లు 15 నిమిషాల పాటు మూసివేయనున్నారు.  ఈ ఏరియాల్లో  ప్రయాణించే  ప్రయాణికులు  తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. ప్రధాని  భారీ ఎన్నికల రోడ్ షో  నేపథ్యంలో కేంద్ర బలగాలు భారీ భద్రతను ఏర్పాటు చేశాయి.  కాగా తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.  డిసెంబర్ 03న ఫలితాలు వెలువడనున్నాయి.