హైదరాబాద్ మెట్రో ట్రైన్ టైమింగ్స్ మరోసారి మారనున్నాయి. అన్ని టెర్మినల్స్ నుంచి ఉదయం 6 గంటలకు మొదటి ట్రైన్ ప్రారంభం కానుంది. రాత్రి 11 గంటలకు చివరి ట్రైన్ ఉండనుంది. ఇక నుంచి వర్కింగ్ డేస్‌తో పాటు వీకెండ్లో కూడా సేమ్ టైమింగ్స్ ఉండనున్నాయి.
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో ట్రైన్ టైమింగ్స్ మరోసారి మారనున్నాయి. నవంబర్ 3వ తేదీ నుంచి కొత్త టైమింగ్స్ అమలులోకి రానున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. అన్ని టెర్మినల్స్ నుంచి ఉదయం 6 గంటలకు మొదటి ట్రైన్ ప్రారంభం అవుతుందని.. అదే విధంగా రాత్రి 11: గంటలకు చివరి ట్రైన్ ఉంటుందని పేర్కొంటూ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటి వరకు వర్కింగ్ డేస్ అయిన సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు మొదటి చివరి ట్రైన్ నడిచేది. శనివారం ఉదయం - 6 గంట నుంచి రాత్రి 11:00 గంటలకు చివరి ట్రైన్ ఉండేది. ఆదివారం మొదటి ట్రైన్ 7:00 గంటలకు, చివరి ట్రైన్ 11 గంటలకు ప్రారంభం అయ్యేవి.
అయితే సవరించిన టైమింగ్స్ ప్రకారం.. ఇక నుంచి వర్కింగ్ డేస్ తో పాటు వీకెండ్ లో కూడా సేమ్ టైమింగ్స్ ఉండనున్నాయి. అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు.. మొదటి ట్రైన్ ఉదయం 6:00 గంటలకు ప్రారంభమైతే.. చివరి ట్రైన్ 11:00 గంటలకు అన్ని టెర్మినల్స్ నుంచి ప్రారంభమవుతుంది.
