హైదరాబాద్లో రూ. 8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్లో రూ. 8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి హెరాయిన్‌, కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 

విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న నైజీరియన్ ను పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ లో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్  నైజీరియన్ అమ్ముతున్నాడని తెలిపారు. గోవా కేంద్రంగా డ్రగ్స్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌ దేశస్థుడు స్టాన్లీని సోమవారం(ఫిబ్రవరి 05) ఎర్రమంజిల్‌ మెట్రోస్టేషన్‌ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అతడి వద్ద చాలా మంది డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌, 9 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ కేసులో 557 గ్రామ్స్ కొకైన్, 902 Ecstacy పిల్స్, 105 LSD బ్లాట్స్, 215 గ్రామ్స్ చరస్, 21 గ్రామ్స్ హెరాయిన్ తో పాటు ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముంబైలో బట్టల వ్యాపారం చేస్తానని 2009 లో బిజినెస్ వీసాతో ఇండియాకి వచ్చాడని.. 
ఆ తర్వాత గోవాలో కొందరు నైజీరియన్ డ్రగ్ పెడలర్స్ తో కలిసి డ్రగ్స్ సప్లై చేశాడని పేర్కొన్నారు. వీసా ఎక్స్పైరీ కేసులో 6 నెలల పాటు గోవా జైల్లో ఉన్నాడని.. 2017 లో డ్రగ్స్ సప్లయ్ చేస్తుండగా NCB పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకుని హైదరాబాద్ కి డ్రగ్స్ సప్లై చేసేవాడని వెల్లడించారు. 

కొరియర్ సర్వీసెస్ ద్వారా డ్రగ్స్ తెప్పించేవాడని.. గతంలో ఎస్సార్ నగర్ డ్రగ్స్ కేసులో అరెస్ అయి నిందితుల ద్వారా ఇతని గురించి తెలుసుకుని... నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఇతనికి దేశవ్యాప్తంగా 500 మంది కస్టమర్లు ఉన్నారని.. హైదరాబాద్ నుంచి ఏడుగురు కస్టమర్లకి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని వివరించారు. పంజాగుట్టలో పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ. 8 కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రతీ పబ్, బార్, రెస్టారెంట్లపై నిఘా పెట్టామని.. డ్రగ్స్ వినియోగదారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా డ్రగ్స్ కి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న ప్రజలు పోలీసులకు తెలపాలని సూచించారు.