పాతబస్తీలో పోలీసుల దౌర్జన్యం

పాతబస్తీలో పోలీసుల దౌర్జన్యం
  • యువకుడిపై దాడి

హైదరాబాద్‌: పాతబస్తీ బహదూర్పరా పోలీసులు దౌర్జన్యం చేశారు. హఫీజ్‌ అనే మొబైల్‌ షాప్‌ నిర్వాహకుడిపై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. కేసు విచారణ కోసం స్టేషన్‌కు పిలిచి ఎస్‌ఐ దాడి చేసి కొట్టాడని బాధితుడి అన్న చెప్పారు. గాయాలై తీవ్ర రక్తస్రవావం అవుతున్నా హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. హఫీజ్‌ అనే యువకుడు బహదూర్పురాలో మొబైల్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. కాగా.. ఐదు రోజుల క్రితం అతని షాప్‌ ఎదుట ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. వాళ్లకి హఫీజ్‌ సర్దిచెప్పి పంపించేశాడు. ఆ కేసుకు సంబంధించి మాట్లాడేందుకు స్టేషన్‌కు పిలిచిన ఎస్సై దాడి చేశాడు. దీంతో హఫీజ్‌ ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చింది.