జూబ్లీహిల్స్ పబ్ కేసులో మరో నిందితుడి అరెస్ట్

జూబ్లీహిల్స్ పబ్ కేసులో మరో నిందితుడి అరెస్ట్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో మరో మైనర్ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన వెలుగులోకి వచ్చింది మొదలు రాష్ట్రమంతటా అట్టుడుకుతుండడం పోలీసులపై ఒత్తిడి పెంచింది. ఘటన సమయంలో వాడిన కారును సీజ్ చేసిన పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురు మైనర్లు, ఒక మేజర్ నిందితుడ్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మైనర్లను జువెనైల్ హోంకు తరలించి.. మేజర్ నిందితుడ్ని మాత్రం జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా రిమాండుకు ఆదేశించారు. ఇవాళ ఆదివారం తాజాగా మరో మైనర్ నిందితుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో మేజర్ నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మైనర్ అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్

పిలిచి ముఖం చాటేసిన మంత్రిపై సర్పంచ్‌‌ల ఆగ్రహం

మొట్టమొదటి సారిగా మహిళల కోసమే..