విఫలమైన సన్ రైజర్స్ బ్యాటర్లు..లక్నోకు స్వల్ప టార్గెట్

విఫలమైన సన్ రైజర్స్ బ్యాటర్లు..లక్నోకు స్వల్ప టార్గెట్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలకు 8 వికెట్లు కోల్పోయి 121 పరుగుల చేసింది. ఓపెనర్ అన్ మోల్ ప్రీత్ సింగ్ (31, 26 బంతుల్లో), రాహుల్ త్రిపాఠి (35, 41 బంతుల్లో), అబ్దుల్ సమాద్ (21, 10 బంతుల్లో) పరవాలేదనిపించారు. హైదరాబాద్ టాప్ బ్యాట్స్ మెన్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (8), హ్యారీ బ్రూక్స్ (3) దారుణంగా విఫలం అయ్యారు.

కెప్టెన్ మార్క్రమ్ ఖాతా ఓపెన్ చేయకుండానే గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుంధర్ (16, 28 బంతుల్లో) ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసినా.. నిరాశే మిగిలింది. లక్నో బౌలర్లలో క్రునాల్ పాండ్యాకు 3 వికెట్లు దక్కాయి. అమిత్ మిశ్రా 2 వికెట్లు పడగొట్టాడు. రవి బిష్నోయ్, యష్ ఠాకూర్ కు చెరో వికెట్ దక్కింది.