వాహనాలను దారి మళ్లించిన ఆఫీసర్లు
నాగర్‌కర్నూల్, వెలుగు : హైదరాబాద్ – -శ్రీశైలం ప్రధాన రహదారిపై కల్వకుర్తి, అచ్చంపేట మధ్య ఉన్న డిండి ప్రాజెక్ట్ అలుగు ప్రమాదకరంగా పారుతోంది. వరద ధాటికి లోలెవల్ బ్రిడ్జి రిటైనింగ్ వాల్ కుంగిపోయి రోడ్డు కోతకు గురైంది. వరద నీరు బ్రిడ్జి మీదుగా వెళ్తుండడంతో అప్రమత్తమైన ఆఫీసర్లు రాకపోకలను నిలిపివేసి వాహనాలను దారి మళ్లించారు.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే వారు కల్వకుర్తి నుంచి మంతటి రోడ్డు మీదుగా తెల్కపల్లి, లింగాల, బల్మూరు, అచ్చంపేట మీదుగా రంగాపూర్ రోడ్డు ద్వారా శ్రీశైలం వెళ్లాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు.
