హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా బంద్

 హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా బంద్

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటికి అంతరాయం కలగనుంది.  హైదరాబాద్కు  తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-1 లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ముర్మూర్ నుంచి బొమ్మకల్ వరకు ఉన్న 3వేల ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ పైపులైనుకు 22.4 కి.మీ, 24.05 కిలోమీటర్ల దగ్గర కిలోమీటర్ల దగ్గర లీకేజీలు అరికట్టడానికి మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీని కారణంగా రెండు రోజుల పాటు భాగ్యనగరానికి తాగునీటి సరఫరా బంద్ కానుంది. 

ఎప్పటి నుంచి ఎప్పటి వరకు..

జులై 19వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు జులై 20వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటల వరకు మరమ్మతు  ఈ పనులు జరుగుతాయి.  కాబట్టి 36 గంటల పాటు జలమండలి  పలు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది.

పాక్షికంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: 

  • ఓ అండ్ ఎం డివిజన్-6 (ఎస్.ఆర్.నగర్): బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ.
  • ఓ అండ్ ఎం డివిజన్-9(కూకట్ పల్లి): కేపీహెచ్ బీ, మలేషియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. 
  • ఓ అండ్ ఎం డివిజన్-15 (శేరిలింగంపల్లి): లింగంపల్లి నుంచి కొండాపూర్, గోపాల్ నగర్, మయూరి నగర్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. 
  • ఓ అండ్ ఎం డివిజన్-23(నిజాంపేట్): ప్రగతినగర్ లో కొన్ని ప్రాంతాలు, నిజాంపేట్/ బాచుపల్లి.

పూర్తిగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: 

  •  ఓ అండ్ ఎం డివిజన్-9(కూకట్ పల్లి): ఎల్లమ్మ బండ, అల్వాల్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు. 
  •  ఓ అండ్ ఎం డివిజన్-12(కుత్బుల్లాపూర్): షాపూర్ నగర్, చింతల్, జీడిమెట్ల/ వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, అల్వాల్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. 
  • ఓ అండ్ ఎం డివిజన్- 13 (మల్కాజిగిరి/ అల్వాల్): సైనిక్ పురి, డిఫెన్స్ కాలనీ, అల్వాల్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు.
  • ఓ అండ్ ఎం డివిజన్-14(ఉప్పల్): కాప్రా మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాలు. సాయిబాబా నగర్, రాధిక, మహేష్ నగర్, అవుట్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. 
  • ఓ అండ్ ఎం డివిజన్-19(నాగారం/ దమ్మాయిగూడ): నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి, కీసర, ఆర్జీకే ప్రాంతాలు.
  • ఓ అండ్ ఎం డివిజన్-24(బొల్లారం): రింగ్ మెయిన్ - 3 ఆన్ లైన్ సప్లై.
  • ఓ అండ్ ఎం డివిజన్-25(కొంపల్లి): కొంపల్లి, గొండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దేవరయాంజల్, హకీంపేట్ ప్రాంతాలు. 
  • ఆర్డబ్ల్యూఎస్ ఆప్ టేక్ ప్రాంతాలు: ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి) ఘన్ పూర్ (మేడ్చల్/ శామీర్ పేట్), కంటోన్మెంట్ లోని కొన్ని ప్రాంతాలు, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు. 

ఈ ప్రాంతాల్లోని ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు కోరారు.