రాఖీ పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పోటెత్తారు జనం. దీంతో గురువారం ( ఆగస్టు 27 ) మధ్యాహ్నం నుంచి సిటీలోని బస్టాండ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలో ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వరంగల్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మూడు గంటలకు పైగా భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంత వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
వరంగల్ నుంచి వచ్చే రూట్ లో కూడా రాఖీ రద్దీ ఎఫెక్ట్ కనపడింది. మేడిపల్లి నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్ వరకు కూడా భారీగా జామ్ అయ్యింది.ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర ఫ్లైఓవర్ పనుల కారణంగా నల్లచెరువు పక్కన తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు.ఇక్కడి నుండి హన్మకొండ,వరంగల్ ,నర్సంపేట, జనగాం, యాదగిరి గుట్ట , తొర్రూరు వెళ్లే బస్సులు అపరెట్ చేస్తోంది ఆర్టీసి.రేపే రాఖీ పండుగ కావడంతో వివిధ ప్రాంతాల నుండి నల్లచెరువు ఉప్పల్ బస్ స్టాప్ దగ్గరికి చేరుకున్నారు వస్తున్నారు ప్రయాణికులు
రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగిన క్రమంలో అదనపు సర్వీసులు కూడా ఏర్పాటు చేసింది ఆర్టీసీ. ఇదే రద్దీ ఆగస్టు 28, 31 తేదీల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు.
రద్దీ కారణంగా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు అధికారులు. అయితే, స్పెషల్ బస్సుల్లో సాధారణ చార్జీల కంటే 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది ఆర్టీసీ.
