రాఖీ పండగ పూట..జగిత్యాల జిల్లాలో కుక్కల స్వైర విహారం... 24 మందిని కరిచాయి..

రాఖీ పండగ పూట..జగిత్యాల జిల్లాలో కుక్కల స్వైర విహారం... 24 మందిని కరిచాయి..

రాఖీ పండగ పూట జగిత్యాల జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 24 మందిపై దాడి చేశాయి కుక్కలు. గురువారం ( ఆగస్టు 27 ) జరిగిన ఈ ఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని కోరుట్ల పట్టణంలోని రామ్ నగర్ బిలాల్పుర కాలనీలో జరిగింది ఈ ఘటన.  రాఖీ పండగ సందర్భంగా రాఖీ కట్టేందుకు వచ్చిన తల్లులు పిల్లలపై దాడి చేశాయి వీధి కుక్కలు.

వీధి కుక్కలు ఇవాళ ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు 24 మందిని కరిచినట్లు తెలుస్తోంది. క్షహతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఒకరిద్దరు మినహా ఎవరికీ తీవ్ర గాయాలవ్వలేదు. మునిసిపల్ అధికారులు వీధి కుక్కలను నియంత్రించి తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు కాలనీ వాసులు.

ఇదిలా ఉండగా.. నిజామాబాద్ జిల్లాలో కూడా ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది.జిల్లాలోని మోర్తాడ్ మండల కేంద్రంలో పిచ్చి కుక్క దాడిలో 13మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఎనిమిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు/ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కలను నియంత్రించి తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు మోర్తాడ్ ప్రజలు.