ఓయో​ బుకింగ్స్​లో.. హైదరాబాద్ ​నం.1

ఓయో​ బుకింగ్స్​లో.. హైదరాబాద్ ​నం.1
  • ఓయో​ బుకింగ్స్​లో.. హైదరాబాద్ ​నం.1
  • రెండోస్థానంలో బెంగళూరు
  • యూపీకి అత్యధిక విజిటర్స్​
  • వెల్లడించిన ఓయో ట్రావెలోపీడియా

న్యూఢిల్లీ:  మనదేశంలో ఈ సంవత్సరం అత్యధిక ఓయో​​బుకింగ్స్​ వచ్చిన నగరంగా హైదరాబాద్ నిలిచింది. తర్వాత స్థానంలో బెంగళూరు ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యధికులు సందర్శించారు. ఆ తర్వాతి స్థానంలో  మహారాష్ట్ర  ఉంది. హాస్పిటాలిటీ టెక్ ప్లాట్‌‌ఫారమ్ ఓయో  ట్రావెలోపీడియా 2023 ఈ వివరాలను వెల్లడించింది.  దీని ప్రకారం, సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు సంవత్సరంలో అన్ని లాంగ్ వీకెండ్‌‌ల కంటే అత్యధిక బుకింగ్స్​ నమోదయ్యాయి. అత్యధికంగా బుకింగ్స్​ నమోదైన నగరంగా హైదరాబాద్ ఆవిర్భవించింది. బెంగళూరు, ఢిల్లీ  కోల్‌‌కతా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గోరఖ్‌‌పూర్, దిఘా, వరంగల్,  గుంటూరు వంటి చిన్న పట్టణాలకు 2022తో పోలిస్తే ​ వార్షికంగా బుకింగ్స్ ఎన్నో రెట్లు పెరిగాయి.

 విశ్రాంతి ప్రదేశం విషయంలో అత్యధికులు  జైపూర్​కు మొగ్గు చూపారు. గోవా, మైసూర్  పుదుచ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యధికంగా బుక్ అయిన తీర్థయాత్రల గమ్యస్థానంగా పూరీ తొలిస్థానాన్ని పొందింది. తరువాత అమృతసర్, వారణాసి,  హరిద్వార్ ఉన్నాయి. దేవ్​గఢ్​, పళని  గోవర్ధన్ వంటి అంతగా తెలియని ఆధ్యాత్మిక ప్రాంతాలకు కూడా 2022తో పోలిస్తే 2023లో సందర్శకులు బాగా పెరిగారు. రాష్ట్రాల విషయానికి వస్తే, ఈ సంవత్సరం అత్యధికంగా బుక్ అయిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. 

సెప్టెంబర్​30.. ఫుల్లు డిమాండ్​

 ఈసారి సెప్టెంబరు 30న అత్యధికంగా బుకింగ్స్​ వచ్చాయి. అయితే నెలలపరంగా చూస్తే మే  నెల ముందు వరుసలో ఉంది. ముఖ్యంగా, సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు ఉన్న అన్ని  వారాంతాల్లో అత్యధిక బుకింగ్స్​ వచ్చాయి. యూఎస్​లో ఓయో కస్టమర్లు 2023లో అత్యధికంగా ప్రయాణించిన మొదటి ఐదు రాష్ట్రాలు టెక్సాస్, ఒరెగాన్, లూసియానా, ఓక్లహోమా  ఫ్లోరిడా కాగా, హ్యూస్టన్, తుల్సా, ఇర్వింగ్, ఓక్లహోమా, సిటీ  వేడ్ అత్యధికంగా ప్రయాణించిన మొదటి ఐదు నగరాలు. యూకేలో, లండన్, ప్లైమౌత్, మిడిల్స్‌‌బ్రో, షెఫీల్డ్  ఈస్ట్‌‌బోర్న్ 2023లో టాప్ హాలిడే డెస్టినేషన్స్‌‌గా నిలిచాయి. 

యూరప్ విషయానికొస్తే, ఆస్ట్రియాలోని సాల్జ్‌‌బర్గ్  టైరోల్, బెల్జియంలోని వెస్ట్ ఫ్లాండర్స్  లీజ్, డెన్మార్క్‌‌లోని బ్లావాండ్  మేరీలిస్ట్, నెదర్లాండ్స్‌‌లోని నార్త్ హాలండ్,  గెల్డర్స్  జర్మనీలోని బాల్టిక్ సముద్రం,  ఉత్తర సముద్ర ప్రాంతాలకు ఈ సంవత్సరం అత్యధిక డిమాండ్​ కనిపించింది. ఇండోనేషియాలోని జకార్తా, బాండుంగ్, బాలి, మెడాన్,  యోగ్యకార్తా మొదటి ఐదు గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఓయోకు భారతదేశం, యూకే, యూఎస్​, ఇండోనేషియా, మలేషియా, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, నెదర్లాండ్స్, ఆసియా​ తదితర దేశాల్లో 9.3 కోట్ల మందికిపైగా కస్టమర్లు ఉన్నారని సంస్థ ఈ రిపోర్టులో పేర్కొంది.  

"ట్రావెల్ పరిశ్రమకు  2023 కీలక సంవత్సరంగా నిలుస్తుంది. కరోనాతో ఎదురైన సవాళ్ల తర్వాత పూర్తి సాధారణ స్థితికి తిరిగి వచ్చే అవకాశం ఉంది.   కరోనా సమయంలో మాదిరే ఇప్పుడు కూడా దేశీయ గమ్యస్థానాలకు వెళ్లే వారి సంఖ్య బాగానే ఉంది.  ప్రపంచవ్యాప్తంగా, విశ్రాంతి గమ్యస్థానాలకు (లీజర్​ డెస్టినేషన్లు) డిమాండ్​ బాగా పెరిగింది.  భారతదేశం నుంచి వ్యాపార ప్రయాణాలు కూడా పెరిగాయి"- ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్‌‌బోలే